![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -299 లో.....రామలక్ష్మి, సీతాకాంత్ లు సిరి శ్రీమంతానికి వస్తారు. ఇక వాళ్ళు వచ్చాక అవమానించడమే పనిగా పెట్టుకుంటారు. సీతాకాంత్, రామలక్ష్మి సోఫాపై కూర్చోబోతుంటే అవి మీకు కాదని , కింద కూర్చోమని అనగానే సీతాకాంత్ బాధపడతాడు. రామలక్ష్మి వాళ్లకు సమాధానం చెప్తుంటే.. వదిలేయమని సీతాకాంత్ అంటాడు. ఇద్దరు కింద కూర్చొని ఉంటారు.
శ్రీలత, శ్రీవల్లి ఇద్దరు సోఫాపై కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఉంటారు. రామలక్ష్మికి కోపం వచ్చి ఒక్కసారి పైకి లేస్తుంది. దాంతో అందరూ భయపడి నిల్చుంటారు. ఎందుకు నిల్చొని ఉన్నావని సీతాకాంత్ అడుగగా.. కాలు తిమ్మిరి ఎక్కిందని రామలక్ష్మి అంటుంది. నేను అంటే నన్ను కొడుతుందని భయపడ్డా.. మీరెందుకు లేచారని శ్రీలతతో శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత సిరి వస్తుంది. తనకి ముందుగా ధన అక్షింతలు వేసి ఆశీర్వదిస్తాడు. అలా అందరు ఆశీర్వాదిస్తారు. సిరి దగ్గరికి రామలక్ష్మి, సీతాకాంత్ వెళ్ళబోతుంటే.. మీరు అవసరం లేదని సిరి అంటుంది. దాంతో సీతాకాంత్, రామాలక్ష్మి ఇద్దరు షాక్ అవుతారు.
మీరు నా స్థాయి కాదు.. ఇంత చీప్ సారీ పట్టుకొని వస్తారా అని సిరి వారిద్దరిని అవమానిస్తుంది. నేను ఎంత చేసానో గుర్తు లేదా అని సీతాకాంత్ అనగానే.. అదంతా గొప్పలు చెప్పుకోవడానికి అని సిరి అంటుంది. చాలా బాగా అంటున్నావ్.. ఇన్ని రోజులు వాడి పార్టీ అనుకున్నాను కానీ నా పార్టీనే అని శ్రీలత మురిసిపోతుంది. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచావ్.. ఇలా అంటున్నావని రామలక్ష్మి అంటుంది . మీరు నా భర్తని చేతకాని వాడు అంటూ తిట్టారు కదా అని సిరి అంటుంది. వచ్చాం కదా మీరు ఆశీర్వాదించండి అని సీతాకాంత్ కి అక్షింతలు ఇస్తుంది రామలక్ష్మి. సీతాకాంత్ ఆశీర్వదించబోతుంటే వద్దు ఇక వెళ్ళండి అని సిరి అంటుంది. దాంతో బాధపడుకుంటూ ఇద్దరు వెళ్తారు. సీతాకాంత్ ఒక దగ్గర ఆగి సిరి అన్న మాటలు గుర్తుచేసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |